పేద ప్రజలకు వైద్యం ఒక హక్కుగా కల్పించాలి : కోదండరాం

ABN , First Publish Date - 2021-05-30T17:29:20+05:30 IST

టీజేఎస్ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం మౌనదీక్షను విరమించారు. ఉదయం 8గంటల నుంచి 9 గంటల వరకు టీజేఎస్‌

పేద ప్రజలకు వైద్యం ఒక హక్కుగా కల్పించాలి : కోదండరాం

హైదరాబాద్: టీజేఎస్ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం మౌనదీక్షను విరమించారు. ఉదయం 8గంటల నుంచి 9 గంటల వరకు టీజేఎస్‌ కార్యాలయంలో కోదండరాం దీక్ష చేపట్టారు. దీక్ష విరమించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, పేద ప్రజలకు వైద్యం ఒక హక్కుగా ప్రభుత్వం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదే విధంగా ర్యాపిడ్ టెస్ట్ కిట్లను అందుబాటులో ఉంచాలన్నారు. గ్రామాల్లో ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. సాధ్యమైనంత త్వరగా అందరికీ టీకాలు ఉచితంగా ఇవ్వాలని, డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద కరోనాతో చనిపోయిన కుంటుబాలను ఆదుకోవాలని తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీపై ఒక కమిటీ నిరంతరం పని చేయాలి ప్రభుత్వానికి కోదండరాం సూచించారు.

Updated Date - 2021-05-30T17:29:20+05:30 IST