రేపు హనుమకొండకు కిషన్‌‌రెడ్డి

ABN , First Publish Date - 2021-08-20T02:22:53+05:30 IST

కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి శుక్రవారం ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో సుడిగాలి పర్యటన చేపట్టనున్నారు.

రేపు హనుమకొండకు కిషన్‌‌రెడ్డి

హనుమకొండ: కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి శుక్రవారం ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో సుడిగాలి పర్యటన చేపట్టనున్నారు. కేంద్ర మంత్రి పర్యటన ఉదయం నుంచి రాత్రి వరకు వరంగల్‌, హనుమకొండ, మహబూబాబాద్‌, జనగామ జిల్లాల మీదుగా సాగుతుంది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇంతకు ముందు హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న కిషన్‌ రెడ్డి.. శాఖ మారిన తర్వాత హనుమకొండకు రావడం ఇదే మొదటిసారి. అనేక దర్శనీయ స్థలాలు ఉన్న వరంగల్‌, హనుమకొండ జిల్లాలో పర్యాటక శాఖ మంత్రిగా ఆయన పర్యటన ప్రాధాన్యతను సంతరించుకున్నది. 

Updated Date - 2021-08-20T02:22:53+05:30 IST