వర్గీకరణ చేయకపోతే కిషన్‌రెడ్డి రాజీనామా చేయాలి: వంగపల్లి
ABN , First Publish Date - 2021-12-15T08:28:19+05:30 IST
ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ చేపట్టకపోతే కేంద్ర మంత్రి పదవికి కిషన్ రెడ్డి రాజీనామా చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ డిమాండ్ చేశారు.

ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ చేపట్టకపోతే కేంద్ర మంత్రి పదవికి కిషన్ రెడ్డి రాజీనామా చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ డిమాండ్ చేశారు. వర్గీకరణ చేస్తామని కల్లబొల్లి కబుర్లు చెబుతూ జాప్యం చేస్తున్న కిషన్ రెడ్డికి, బీజేపీకి మాదిగలు తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు. దళితులను ఓటు బ్యాంకుగా వాడుకుంటూ పదవులు పొంది వర్గీకరణను ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు.