‘ఫోర్బ్స్’ జాబితాలో కీర్తిరెడ్డికి చోటు
ABN , First Publish Date - 2021-02-06T06:07:06+05:30 IST
ప్రపంచ ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక ప్రకటించిన 30 మంది యువ ప్రతిభావంతుల జాబితాలో సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారం గ్రామానికి చెందిన కీర్తిరెడ్డికి చోటు దక్కింది.

- 30 మంది యువ ప్రతిభావంతుల జాబితాకు ఎంపిక
- ‘స్టాట్విగ్’ వ్యాక్సిన్ ట్రాకింగ్ కంపెనీ సీఓఓగా ప్రతిభ
- మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తనయకు గుర్తింపు
సిద్దిపేట, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక ప్రకటించిన 30 మంది యువ ప్రతిభావంతుల జాబితాలో సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారం గ్రామానికి చెందిన కీర్తిరెడ్డికి చోటు దక్కింది. ఈమె మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి కుమార్తె. లండన్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్‌లో గ్లోబల్ మాస్టర్స్ పట్టా పొందిన కీర్తి, ప్రస్తుతం స్టాట్విగ్ అనే వ్యాక్సిన్ ట్రాకింగ్ కంపెనీకి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీఓఓ)గా పనిచేస్తున్నారు. ఆమె ఆ సంస్థ సహ వ్యవస్థాపకురాలు కూడా. ఫార్మా కంపెనీల్లో తయారైన వ్యాక్సిన్ గమ్యస్థానాలకు చేరేదాకా నిరంతరం పర్యవేక్షించేలా వ్యాక్సిన్ ట్రాకింగ్ విభాగాన్ని కీర్తి నిర్వహించి సత్ఫలితాలను సాధించారు. దీంతో ఆమెను యువ ప్రతిభావంతుల జాబితాకు ‘ఫోర్బ్స్’ ఎంపిక చేసింది. 24 ఏళ్లకే ప్రపంచస్థాయి గుర్తింపును పొందిన తాను, సొంతంగా బిజినె్‌సను ప్రారంభించి ప్రజలకు ఉపయోగపడే సేవలు అందిస్తానని కీర్తిరెడ్డి చెప్పారు.