రాచకొండలో కిలాడీ లేడీ అరెస్ట్

ABN , First Publish Date - 2021-02-27T01:00:33+05:30 IST

రాచకొండలో కిలాడీ లేడీని పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరుకు చెందిన ఎంబీఏ యువతి అర్చనను పోలీసులు అరెస్ట్ చేశారు.

రాచకొండలో కిలాడీ లేడీ అరెస్ట్

హైదరాబాద్‌: రాచకొండలో కిలాడీ లేడీని పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరుకు చెందిన ఎంబీఏ యువతి అర్చనను పోలీసులు అరెస్ట్ చేశారు. మాట్రిమోనీలో నకిలీ ప్రొఫైల్స్ పెట్టి అర్చన డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు గుర్తించారు. ఎన్నారైలను టార్గెట్ చేసి పలువురిని యువతి మోసం చేసిందని పోలీసులు చెబుతున్నారు. మాట్రిమోనీలో ఫేక్ ప్రొఫైల్స్‌ క్రియేట్ అర్చన చేసుకుందని పోలీసులు పేర్కొన్నారు. ప్రొఫైల్‌పై ఆసక్తి చూపిన ఎన్నారైలకు ఆమె కాల్ చేస్తున్నట్లు సమాచారం.


ఫోన్ నెంబర్ దొరకకుండా మొబైల్‌ సాఫ్ట్‌వేర్‌ నుంచి కాల్స్‌ అర్చన కాల్ చేస్తునట్లు గుర్తించారు. షార్ట్ వీసా మీద ఇండియా వచ్చానంటు యువతి నమ్మబలికినట్లు చెబుతున్నారు. తనను కలవాలంటే డబ్బులు చెల్లించాలని బాధితులకు ఆమె డిమాండ్ చేసిందని చెబుతున్నారు. పలువురిని  యువతి ఇదే రీతిలో మోసం చేసినట్లు గుర్తించారు. రాచకొండ పోలీసుల అదుపులో అర్చన ఉంది. ఆమెపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పోలీసులు తరలించినట్లు తెలుస్తోంది.

Updated Date - 2021-02-27T01:00:33+05:30 IST