ఓ యువతికి చాక్లెట్‌ ఆశ చూపి అత్యాచారం..

ABN , First Publish Date - 2021-12-15T12:35:48+05:30 IST

మానసిక వైకల్యంతో బాధపడుతున్న ఓ యువతికి చాక్లెట్‌ ఆశ చూపి అత్యాచారం చేశాడు ఓ వృద్దుడు. భద్రాది కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలానికి చెందిన మానసిక వైకల్యం కలిగిన 22ఏళ్ల

ఓ యువతికి చాక్లెట్‌ ఆశ చూపి అత్యాచారం..

ఖమ్మం: మానసిక వైకల్యంతో బాధపడుతున్న ఓ యువతికి చాక్లెట్‌ ఆశ చూపి అత్యాచారం చేశాడు ఓ వృద్దుడు. భద్రాది కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలానికి చెందిన మానసిక వైకల్యం కలిగిన 22ఏళ్ల యువతిపై అదే గ్రామానికి చెందిన 58 సంవత్సరాల లాకావత్‌ దేవ్లా  లైంగిక దాడి చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 13వ తేదీ సోమవారం ఇంట్లో ఎవ్వరులేని సమయంలో ఒంటరిగా ఉన్న యువతికి లాకవత్‌ దేవ్లా.. చాక్లెట్‌, డబ్బులు ఆశ చూపి లైంగికదాడి చేశాడు. ఈ క్రమంలో ఆమె ఏడవడంతో గమనించిన చుట్టుపక్కలవారు ఇంట్లోకి వెళ్లగా.. వారిని చూసిన దేవ్లా పరారయ్యాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఇల్లెందు ఎస్‌ఐ కుమారస్వామి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. లైంగిక దాడికి పాల్పడిన దేవ్లా పరారీలో ఉన్నాడు.  

Updated Date - 2021-12-15T12:35:48+05:30 IST