పాల్వంచలో సైకో వీరంగం

ABN , First Publish Date - 2021-07-12T13:00:44+05:30 IST

జోరువానలో ఓ సైకో వీరంగం సృష్టించి పలువురిపై దాడిచే యటంతో స్థానికులు సైకోను చాకచక్యంగా పట్టుకొని పోలీసులకు అప్పగించిన సంఘటన ఆదివారం పాల్వంచలో

పాల్వంచలో సైకో వీరంగం

ఖమ్మం: జోరువానలో ఓ సైకో వీరంగం సృష్టించి పలువురిపై దాడిచే యటంతో స్థానికులు సైకోను చాకచక్యంగా పట్టుకొని పోలీసులకు అప్పగించిన సంఘటన ఆదివారం పాల్వంచలో జరిగింది. స్థానిక నటరాజ్‌ సెంటర్‌లో కొంతమందిపై కర్రతో దాడి చేయటంతో దినకరశాస్ర్తి గాయపడ్డారు. స్థానికులు వారిస్తున్నా వినకపోవ టంతో వెంబడించారు. వారిపైనా దాడికి దిగటంతో సైకోను స్థానిక అంబేద్కర్‌ సెంటర్‌ లోని మోర్‌ సూపర్‌ మార్కెట్‌ వద్ద తాళ్లతో బంధించి పోలీసులకు అప్పగించారు. 

Updated Date - 2021-07-12T13:00:44+05:30 IST