ఖమ్మంలో నూతన బస్టాండ్ నిర్మాణం పూర్తి

ABN , First Publish Date - 2021-03-28T15:20:52+05:30 IST

ఖమ్మం: నగరంలో నూతన బస్టాండ్ నిర్మాణం పూర్తయింది. అత్యాధునిక హంగులతో...

ఖమ్మంలో నూతన బస్టాండ్ నిర్మాణం పూర్తి

ఖమ్మం: నగరంలో నూతన బస్టాండ్ నిర్మాణం పూర్తయింది. అత్యాధునిక హంగులతో  రాష్ట్రంలోనే అతిపెద్ద బస్టాండ్ ఖమ్మంలో రూపు దిద్దుకుంది. ప్రజలకు మెరుగైన వసతులు, రవాణా వసతులు కల్పిస్తామని మంత్రి అజయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పాటు చేసుకున్న అత్యాధునిక హంగులతో అతిపెద్ద మొదటి బస్టాండ్ అని అన్నారు. ఏడెకరాల స్థలంలో సుమారు రూ. 25కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టామన్నారు. అన్ని ప్రాంతాలకు సెంటర్‌గా ఉండే విధంగా బస్టాండ్ ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడకు ప్రతి రోజు 15 వందల బస్సులు వస్తుంటాయన్నారు. ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని మంత్రి అజయ్ కుమార్ పేర్కొన్నారు.

Updated Date - 2021-03-28T15:20:52+05:30 IST