కేజీబీవీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2021-01-21T04:07:44+05:30 IST
కేజీబీవీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

మహబూబాబాద్ ఎడ్యుకేషన్, జనవరి 20: కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయ (కేజీబీవీ)ల్లో విధులు నిర్వర్తిస్తున్న మహిళా ఉపాధ్యాయుల స మస్యలు పరిష్కరించాలని టీఎ్‌స-యూటీఎఫ్ జి ల్లా ప్రధానకార్యదర్శి ఎస్కే యాకూబ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహబూబాబాద్‌లోని కేజీబీవీలో భోజన విరామ సమయంలో సంఘం ఆధ్వర్యంలో బుధవారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. సుజాత, రాంజీ, శ్రీనివాస్, వెంకన్న, వెంకట్, యోగానందచారి పాల్గొన్నారు.
డోర్నకల్: డోర్నకల్‌లోని కస్తుర్బా గాంధీ బాలిక ల పాఠశాల వద్ద టీఎస్ యూటీఎఫ్ నాయకులు బుధవారం నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎస్.శ్రీనివాస్, కాసు మారెడ్డి, నామ వెంకటేశ్వర్లు, దేవేందర్, వెంకట్రావులు పాల్గొన్నారు.
నెల్లికుదురు: కేజీబీవీ, యూఆర్‌ఎస్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో భోజన విరామ స మయంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మురళీ కృష్ణ, జాడ్‌పోడ్ ప్రతాప్, సుమలత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కేసముద్రం : మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాం డ్ చేస్తూ టీఎస్ యూటీఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి రాందాస్ ఆధ్వర్యంలో బుధవారం నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎస్‌వో నీలిమ, హుస్సేన్, దుర్గా లక్ష్మి అర్చన, సుష్మా, రహిమున్నీసా, రాధిక పావని, ఉపేంద్ర పాల్గొన్నారు.