కేసముద్రంలో ఆర్యూబీ మంజూరు చేయండి

ABN , First Publish Date - 2021-03-25T05:21:16+05:30 IST

కేసముద్రంలో ఆర్యూబీ మంజూరు చేయండి

కేసముద్రంలో ఆర్యూబీ మంజూరు చేయండి
మంత్రి పీయూ్‌షగోయల్‌కు వినతిపత్రాన్ని అందిస్తున్న ఎంపీ కవిత

 కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూ్‌షగోయల్‌కు ఎంపీ వినతి

మహబూబాబాద్‌, మార్చి 24 (ఆంధ్రజ్యోతి) : మహబూబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని అతిపెద్ద వ్యవసాయ మార్కెట్‌ కలిగి ఉండి, వ్యాపార కేంద్రంగా వెలుగొందుతున్న కేసముద్రం మండల కేంద్రంలో రైల్వే అండర్‌ బ్రిడ్జీ (ఆర్యూబీ)ని మంజూరు చేయాలని ఎంపీ మాలోతు కవిత  విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు న్యూఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూ్‌షగోయల్‌కు బుధవారం వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఎంపీ కవిత మాట్లాడుతూ... కేసముద్రంలో వ్యవసాయ మార్కెట్‌తో పాటు రైస్‌, అయిల్‌ మిల్లులతో పాటు పసుపు పాలిష్‌ కేంద్రాలు, కాటన్‌ జిన్నింగ్‌ మిల్లులు ఉన్నాయని చెప్పారు. పారిశ్రామిక ప్రాంతంగా పేరుగడించిన కేసముద్రంలో ఆర్యూబీ కోసం నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరినట్లు ఎంపీ కవిత తెలిపారు. 

===========================

Updated Date - 2021-03-25T05:21:16+05:30 IST