కేసీఆర్ అవినీతిని ఖచ్చితంగా టచ్ చేస్తాం: విజయశాంతి

ABN , First Publish Date - 2021-11-09T22:35:51+05:30 IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శలు గుప్పించారు. టూరిస్ట్ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌కు నామకరణం చేసినట్లు విజయశాంతి తెలిపారు.

కేసీఆర్ అవినీతిని ఖచ్చితంగా టచ్ చేస్తాం: విజయశాంతి

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శలు గుప్పించారు. టూరిస్ట్ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌కు నామకరణం చేసినట్లు విజయశాంతి తెలిపారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై జరిగిన బీజేపీ డప్పు మోత కార్యక్రమంలో విజయశాంతి మాట్లాడారు. కేసీఆర్ చేసిన అవినీతిని ఖచ్చితంగా టచ్ చేస్తామని విజయశాంతి హెచ్చరించారు. 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసే సమయం కేసీఆర్‌కు లేదని ఆమె అన్నారు. కేసీఆర్‌కు రిటైర్మెంట్ ఇవ్వాలని ప్రజలు భావిస్తున్నారని, బీజేపీ అంటే కేసీఆర్‌కు బీపీ పెరుగుతోందని విజయశాంతి మండిపడ్డారు. హుజురాబాద్ ఓటమితో కేసీఆర్‌లో ఫ్రస్టేషన్ పెరిగిపోయిందని ఆమె విమర్శించారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను కమేడియన్‌గా చూస్తున్నారని, దళితబంధు అమలు చేసేవరకు ఉద్యమం చేస్తామని విజయశాంతి హెచ్చరించారు.

Updated Date - 2021-11-09T22:35:51+05:30 IST