సీఎం కేసీఆర్‌కు వినతులు

ABN , First Publish Date - 2021-06-22T05:18:06+05:30 IST

సీఎం కేసీఆర్‌కు వినతులు

సీఎం కేసీఆర్‌కు వినతులు
సీఎం కేసీఆర్‌కు వినతి పత్రం అందజేస్తున్న ఎన్‌హెచ్‌ఎం నాయకులు

హన్మకొండ, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి) : సీఎం వరంగల్‌ ప ర్యటన సందర్భంగా పలువురు ఆయనకు వినతిపత్రాలు అంద జేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. 


దూప, దీప అర్చకుల గౌరవ భృతి పెంచాలి

దూపదీప నైవేద్యాల అర్చకులకు గౌరవ భృతిని రూ.6వేల నుంచి రూ.10వేలకు పెంచాలని తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గంగు ఉపేంద్ర శర్మ కోరారు. మల్టీస్పెషాటిటీ ఆస్పత్రికి భూమిపూజ సందర్భంగా సీఎం కేసీఆర్‌ కు వినతి పత్రాన్ని అందజేశారు. వినతి పత్రం అందచేసిన వారిలో తెలంగాణ రాష్ట్ర అర్చక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు న ల్లాన్‌ చక్రవర్తుల వేణుగోపాలాచార్యులు, తెలంగాణ అర్చక ఉ ద్యోగ జేఏసీ కన్వీనర్‌ పరాశరం రవీంద్రాచార్యులు, దూపదీప నైవేధ్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస సుదర్శన్‌ ఉన్నారు.


ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఆస్పత్రి నిర్మించాలి

వరంగల్‌ సెంట్రల్‌ జైలు స్థలంలో మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రపంచంలోనే అత్యున్నతంగా తీర్చిదిద్దాలని ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్‌ రామక శ్రీనివాస్‌ కోరారు. ఈ మేరకు ఆయన సీఎం కేసీఆర్‌కు పలు సూచనలతో కూడిన సుదీర్ఘమైన లేఖ రాశారు. ఈ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలో అన్ని విభాగాలను ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేస్తే ప్రపంచస్థాయి ఆస్పత్రిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇందులో సంక్రమిత వ్యాధులకు ఒక శాఖను ఏర్పాటు చేయాలని సూచించారు. వైద్యపరిశోధనలకు ప్రాధాన్యమిచ్చేలా పరిశోధన, ప్రజారోగ్యశాఖను ఏర్పాటు చేయాలని, ప్రతీ వ్యాధిని అధ్యయనం చేయడానికి వీలుగా ఎపిడమాలజీ యూనిట్‌ను స్థాపించాలని, ఆస్పత్రి ఆవరణలోనే డాక్టర్లకు, వైద్య సిబ్బందికి, రోగుల బంధువులకు వసతి కల్పించాలని కోరారు. దీనిని స్వయం ప్రతిపత్తి గల వైద్యాలయంగా మార్చాలని డాక్టర్‌ శ్రీనివాస్‌ సూచించారు.


వేతనాలు పెంచాలని వైద్య ఉద్యోగులు

హన్మకొండ అర్బన్‌ : వైద్య, ఆరోగ్యశాఖలోని నేషనల్‌ హెల్త్‌మిషన్‌(ఎ్‌సహెచ్‌ఎం)లో పనిచేస్తున్న ఉద్యోగులకు పీఆర్సీ ప్రకారం వేతనాలు పెంచాలని కోరుతూ సోమవారం సీఎం కేసీఆర్‌కు తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌(టీ యుఎంహెచ్‌ఈయు) నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు ఎన్‌ఎహెచ్‌ఎం ఉద్యోగుల రాష్ట్ర నాయకులు కె.సరోజ పాల్గొన్నారు. 


ఓసీ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి

న్యూశాయంపేట: ఓసీల సంక్షేమానికి కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపు జయపాల్‌ ఓసీ జేఏసీ తరపున సీఎం కేసీఆర్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. ఓసీల్లోని పేద వర్గాల ప్రజల సంక్షేమానికి రాష్ట్రంలో రెడ్డి, వైశ్య, ఇతర ఓసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి సహాయ సహకారాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు రావుల నర్సింహారెడ్డి, దుబ్బా శ్రీనివాస్‌, బోయినపల్లి పాపారావు, కామిడి సతీ్‌షరెడ్డి, వల్లూరి పవన్‌కుమార్‌,  గంగవరపు రామకృష్ణ ప్రసాద్‌, నాగవెళ్లి కేశవరెడ్డి పాల్గొన్నారు.


ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే సతీ్‌షకుమార్‌ కృతజ్ఞతలు

భీమదేవరపల్లి: గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణం పూర్తికి రూ.89 కోట్లు కేటాయించడంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎమ్మెల్యే సతీ్‌షకుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సతీ్‌షకుమార్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణంతో హుస్నాబాద్‌ నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుందన్నారు. ఆదివారం రాత్రి సిద్దిపేటలో జరిగిన సభలో సీఎం కేసీఆర్‌ గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేస్తామని ప్రకటించారన్నారు. వర్షాకాలంలో గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తిచేసి గోదావరి కాళేశ్వరం నీటితో ప్రాజెక్టును నింపుతామన్నారు. రైతుబంధు, రైతుబీమా, సాగునీరు, నిరంతరం ఉచిత విద్యుత్‌, రైతు వేదికలు, తదితర అంశాలు దేశంలో ఎక్కడా అమలు కావడం లేదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు.

Updated Date - 2021-06-22T05:18:06+05:30 IST