మోదీ ప్రజావ్యతిరేక విధానాలపై కేసీఆర్ మాట్లాడటంలేదు: రేవంత్
ABN , First Publish Date - 2021-08-04T00:43:49+05:30 IST
ప్రధాని మోదీ ప్రజావ్యతిరేక విధానాలపై సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ ఎంపీలు మాట్లాడటంలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తప్పుబట్టారు.

హైదరాబాద్: ప్రధాని మోదీ ప్రజావ్యతిరేక విధానాలపై సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ ఎంపీలు మాట్లాడటంలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తప్పుబట్టారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ఎవరి పక్షమో తేలిపోయిందన్నారు. ఆర్థిక నేరాల నుంచి తప్పించుకునేందుకు మోదీకి కేసీఆర్ లొంగిపోయారని ఎద్దేవాచేశారు. కేసీఆర్ ఒత్తిడివల్లే పాదయాత్రను బీజేపీ నేత బండి సంజయ్ వాయిదా వేసుకున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.