కేసీఆర్‌కు కనీసం ఇంకిత జ్ఞానం ఉందా?: రేవంత్‌రెడ్డి
ABN , First Publish Date - 2021-11-28T22:28:37+05:30 IST
టీఆర్ఎస్, బీజేపీ కలిసి కొత్త నాటకానికి తెర లేపారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు.

హైదరాబాద్: టీఆర్ఎస్, బీజేపీ కలిసి కొత్త నాటకానికి తెర లేపారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి దీక్షలో ఆయన మాట్లాడుతూ ఢిల్లీ కెళ్లిన కేసీఆర్..సురేష్‌రెడ్డి ఇంట్లో విందుభోజనం చేసి వచ్చారని తెలిపారు. ప్రధాని మోదీని కలవలేదని, అపాయింట్మెంట్ అడగలేదని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వరి మీద అవగాహన లేని మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీని కేంద్రమంత్రి దగ్గరకు పంపితే ఏం మాట్లాడతారు? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ నేతలు రైతులను ఆదుకోకుండా.. ఫిరాయింపులపై ఆలోచనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. గుండు, అరగుండు వెళ్లి కేంద్రాన్ని అడగరని ఎద్దేవాచేశారు. ఢిల్లీ వెళ్లొచ్చిన బీజేపీ నేత బండి సంజయ్ వరి మాటలు పక్కన పెట్టి.. విద్య, వైద్యంపై సంతకం అని కొత్త రాగం ఎత్తారని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లపై ఢిల్లీలో పోరాటం చేస్తామని రేవంత్‌రెడ్డి ప్రకటించారు.