కడియం నివాసంలో కేసీఆర్‌ లంచ్‌

ABN , First Publish Date - 2021-06-22T05:14:40+05:30 IST

కడియం నివాసంలో కేసీఆర్‌ లంచ్‌

కడియం నివాసంలో కేసీఆర్‌ లంచ్‌
కేసీఆర్‌ను సత్కరించిన కడియం కుటుంబ సభ్యులు

వంటలు రుచిగా ఉన్నాయని కితాబు 


హన్మకొండ టౌన్‌, జూన్‌ 21: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సోమవారం హన్మకొండ లోని తన నివాసంలో ఆతిథ్య మిచ్చారు. వరంగల్‌ అర్బన్‌ కలెక్టరేట్‌ భవన ప్రారంభోత్స వానికి హాజరైన సీఎం కేసీఆర్‌.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ లతో కలిసి కడియం శ్రీహరి ని వాసానికి చేరుకున్నారు. సా యంత్రం 5గంటల సమయం లో నేతలు, కడియం కుటుంబ సభ్యులతో కలిసి ఆయన భోజ నం చేశారు. మాంసాహారం వంటకాల్లో మటన్‌ బిర్యానీ, మటన్‌ కర్రీ, నాటుకోడి, రొయ్యల పులుసు, చేపలు, శాఖాహార వంటకాల్లో బీరకాయ, బెండకాయ ఫ్రై, పాలకూర పప్పు, టమాట, సోరకాయ, సాంబార్‌తో పాటు స్వీట్లు, ఫ్రూట్‌ సలాడ్‌, కలాకంద్‌, దానిమ్మ జ్యూస్‌ వడ్డించారు. వంటకాలను రుచి చూసిన కేసీఆర్‌.. తలకాయ, కాళ్లతో చేసిన కర్రీతో ఇష్టంగా ఆరగించారు. ఈ కర్రీతో పుష్టిగా తిన్న కేసీఆర్‌.. ‘ఏంటి శ్రీహరి ఇంత రుచిగా వడ్డిస్తే మళ్లీ మళ్లీ రావాల్సి వస్తుంది’ అని ప్రశంసించారు. తలకాయ, కాళ్ల కర్రీ చాలా బాగుందని కితాబిచ్చారు. భోజనం చేసిన అనంతరం దానిమ్మ జూస్‌ తాగారు. 


కడియం మనవరాలి జన్మదిన వేడుక

కడియం శ్రీహరి మనవరాలు ఆన్య (కడియం కావ్య కుమార్తె) పుట్టిన రోజు వేడుకను ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో జరిపారు. ఆన్యతో కేక్‌ కట్‌ చేయించారు. అనంతరం శ్రీహరి తన సతీమణి వినయరాణి, తల్లి వెంకటమ్మ, కూతుళ్లు, అళ్లుల్లు డాక్టర్‌ కడియం కావ్య-నజీర్‌, రమ్య-శేషు దంపతులను కేసీఆర్‌కు పరిచయం చేశారు. మనవరాళ్లు దియా, మిన్ని, హామీ, ఆన్యలను కేసీఆర్‌ దీవించారు.  అనంతరం కడియం కుటుంబ సభ్యులు కేసీఆర్‌ను సత్కరించారు. కాగా కడియం కావ్య.. కడియం ఫౌండేషన్‌ ద్వారా తాను చేస్తున్న కార్యక్రమాలను ముఖ్యమంత్రికి వివరించారు.

Updated Date - 2021-06-22T05:14:40+05:30 IST