9వ సారి టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఏకగ్రీవ ఎన్నిక

ABN , First Publish Date - 2021-10-25T17:40:12+05:30 IST

హైటెక్స్‌లో టీఆర్ఎస్ ప్లీనరీ ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ సహా ఇతర నేతలంతా ఇప్పటికే హాజరయ్యారు. టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేసీఆర్ అధ్యక్షుడిగా టీఆర్ఎస్ కీలక నేత కేకే అధికారికంగా ప్రకటించారు.

9వ సారి టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఏకగ్రీవ ఎన్నిక

హైదరాబాద్: హైటెక్స్‌లో టీఆర్ఎస్ ప్లీనరీ ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ సహా ఇతర నేతలంతా ఇప్పటికే హాజరయ్యారు. టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేసీఆర్ అధ్యక్షుడిగా టీఆర్ఎస్ కీలక నేత కేకే అధికారికంగా ప్రకటించారు. 9వ సారి టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. కాగా.. మూడేళ్ల తర్వాత ప్లీనరీ నిర్వహిస్తున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో జోష్‌ నెలకొంది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తొలిసారి 2001లో జలదృశ్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించామన్నారు. రకరకాల అపనమ్మకాల మధ్య గులాబి జెండా ఎగిరిందని.. ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేస్తూ ప్రత్యేక తెలంగాణ సాధించామన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రపంచ ఉద్యమాలను నిర్దేశించిందన్నారు. ఇది శాశ్వతంగా ఉండే కీర్తి అని కేసీఆర్ అన్నారు. అంతకుముందు సీఎం కేసీఆర్ పార్టీ జెండా ఆవిష్కరించి ప్లీనరీని ఏర్పాటు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి.. అమరవీరులకు నివాళులర్పించారు.


Updated Date - 2021-10-25T17:40:12+05:30 IST