గిన్నిస్ రికార్డుల్లోకి ‘Kcr ఎకో అర్బన్ పార్క్’

ABN , First Publish Date - 2021-07-13T03:40:34+05:30 IST

జిల్లాలోని కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్ గిన్నిప్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కింది. జిల్లాకు చెందిన మహిళా సమాఖ్య

గిన్నిస్ రికార్డుల్లోకి ‘Kcr ఎకో అర్బన్ పార్క్’

మహబూబ్‌నగర్ : జిల్లాలోని కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్ గిన్నిప్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కింది. జిల్లాకు చెందిన మహిళా సమాఖ్య నేతలు పది రోజుల్లో 2 కోట్ల 8 లక్షల విత్తన బంతులను తయారు చేశారు. ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ లో భాగంగా వాటిని సోమవారం కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్‌లో వెదజల్లి, చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోశ్ కుమార్, రాష్ట్ర మంత్రి వ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ రికార్డును ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’కు అంకితమిస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి కృషి చేసిన అధికారులను మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, ఎస్పీ తదితరులు పాల్గొన్నారు. 






Updated Date - 2021-07-13T03:40:34+05:30 IST