దళితులను మోసం చేసిన కేసీఆర్‌: నరసింహులు

ABN , First Publish Date - 2021-08-26T02:26:23+05:30 IST

దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని సీఎం కేసీఆర్‌ మోసం చేశారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నరసింహులు దుయ్యబట్టారు.

దళితులను మోసం చేసిన కేసీఆర్‌: నరసింహులు

భూదాన్‌ పోచంపల్లి: దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని సీఎం కేసీఆర్‌ మోసం చేశారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నరసింహులు దుయ్యబట్టారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దళితులకు భూపంపిణీ చేయాలనే లక్ష్యంతో చేపట్టిన భూపంపిణీ నేడు నీరుగారిపోయిందని విమర్శించారు. భూదానోద్యమం స్ఫూర్తి నేడు లేదన్నారు. కేసీఆర్‌ అధికారంలోకి రాగానే భూదాన్‌ యజ్ఞ బోర్డుని రద్దు చేశారని, భూదాన్‌ భూములను విక్రయానికి పెట్టారని తప్పుబట్టారు. రాష్ట్రంలో పెత్తందారీ వ్యవస్థను కేసీఆర్‌ నడిపిస్తున్నారని విమర్శించారు. దళితుల ఉజ్వల భవిష్యత్తుకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. రాష్ట్రంలో ఎన్ని భూములు కబ్జాకు గురయ్యాయో లెక్కలు తేల్చాలని నరసింహులు డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-08-26T02:26:23+05:30 IST