త్వరలో జూకు Kangaroos
ABN , First Publish Date - 2021-10-14T13:54:49+05:30 IST
త్వరలో జూకు Kangaroos
హైదరాబాద్/మదీన: జంతుమార్పిడి పథకంలో భాగంగా జపాన్‌లోని యోకోహమ జూ పార్కు నుంచి నగరంలోని జూకు రెండు కంగారూలు మరో రెండు నెలల్లో రానున్నాయి. అయితే, సామాజిక సేవలో భాగంగా దుండిగల్‌లోని గ్లాండ్ ఫార్మాసూటికల్ లిమిటెడ్ కంపెనీ తరఫున త్వరలో జూకు రానున్న కంగారూల కోసం ఎన్క్లోజర్ను నిర్మించడానికి రూ.20 లక్షల చెక్కును బుధవారం జూపార్కు క్యూరేటర్ సుభద్రాదేవికి అందజేశారు. వచ్చే ఏడాది కంగారూలను దత్తత తీసుకుంటామని హామీ ఇచ్చారు.