కామారెడ్డిలో రెండు బైక్‎లు ఢీ, ఒకరు మృతి

ABN , First Publish Date - 2021-02-26T15:39:11+05:30 IST

జిల్లాలోని జుక్కల్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకువచ్చిన ఎదురెదురుగా వచ్చిన రెండు బైక్‎లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే...

కామారెడ్డిలో రెండు బైక్‎లు ఢీ, ఒకరు మృతి

కామారెడ్డి: జిల్లాలోని జుక్కల్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకువచ్చిన ఎదురెదురుగా వచ్చిన రెండు బైక్‎లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా..మరొ నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన కేంరాజ్ కల్లాలి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని..గాయాలైన వారిని పోలీసులు దగ్గర్లో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-02-26T15:39:11+05:30 IST