ఎల్లారెడ్డిలో మున్సిపల్ కార్మికుడు ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2021-12-10T03:54:59+05:30 IST

ఎల్లారెడ్డిలో మున్సిపల్ కార్మికుడు బెస్త నర్సింహులు ఆత్మహత్యాయత్నం చేశారు. మున్సిపల్ చైర్మన్ సత్యం వేధింపులు భరించలేక ..

ఎల్లారెడ్డిలో మున్సిపల్ కార్మికుడు ఆత్మహత్యాయత్నం

కామారెడ్డి:ఎల్లారెడ్డిలో మున్సిపల్ కార్మికుడు బెస్త నర్సింహులు ఆత్మహత్యాయత్నం చేశారు. మున్సిపల్ చైర్మన్ సత్యం వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. వాటర్ వర్క్స్ విభాగంలో పని చేస్తున్న నర్సింహులును మున్సిపల్ చైర్మన్ సత్యం తొలగించారని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు సత్యం తన మామను అదే పోస్టులో పెట్టడంతో నర్సింహులు మనస్తాపం చెందినట్లు సమాచారం. నర్సింహులుకు ఉద్యోగం పోవడంతో కుంటుంబ పోషణ భారంగా మారిందని, వైద్యం కోసం డబ్బులు కావాలన్నా చైర్మన్ కనికరించకపోవడంతో ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. 

Updated Date - 2021-12-10T03:54:59+05:30 IST