మాకేవీ ఓటు డబ్బులు..?
ABN , First Publish Date - 2021-10-29T05:41:13+05:30 IST
మాకేవీ ఓటు డబ్బులు..?

కమలాపూర్‌లో మహిళా ఓటర్ల ఆందోళన
కమలాపూర్, అక్టోబరు 28: హనుమకొండ జిల్లా క మలాపూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాల య సమీపంలోని రహదారిపై కొందరు మహిళలు, ఓ టర్లు గురువారం ఓటు డబ్బుల కోసం ఆందోళన చేశా రు. ఒక పార్టీ వారు గ్రామంలో కొందరికి ఓటుకు రూ.6వేలు ఇచ్చారని మహిళలు ఆరోపించారు. తమకు మాత్రం డబ్బులు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ నాయకులు కొందరికి డబ్బులు ఇచ్చి తమకు మాత్రం ఎందుకు ఇవ్వరని, తాము ఓట్లు వేయమా? అని ప్రశ్నించారు. తమకు వచ్చిన డబ్బులను నాయకు లు ఎందుకు ఆపారని, తమకు కూడా డబ్బులు ఇచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఓట్లు వేయమని ఆందోళన చేశారు. అందరికీ డబ్బులు ఇచ్చినట్లే తమకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా, విషయం తెలుసుకున్న పోలీసు ఇన్స్‌పెక్టర్ పు ల్యాల కిషన్, ఎస్‌ఐలు పరమేశ్వర్, సురేష్, పోలీసు సి బ్బంది సంఘటన స్థలానికి వచ్చి కోడ్ అమలులో ఉం దని, రహదారిపై ఎలాంటి ఆందోళన కార్యక్రమాల చే యవద్దని అక్కడ నుంచి ఓటర్లను పంపించారు.