నేడు వరంగల్‌లో కాళోజీ విగ్రహావిష్కరణ
ABN , First Publish Date - 2021-06-21T10:15:51+05:30 IST
తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటకు చెందిన ప్రముఖశిల్పి రాజ్‌కుమార్ వడయార్‌చే రూపుదిద్దుకున్న పద్మవిభూషణ్, ప్రజాకవి కాళోజీ నారాయణరావు విగ్రహాన్ని ఆదివారం కొత్తపేట నుంచి వరంగల్‌కు తరలించారు.
తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటకు చెందిన ప్రముఖశిల్పి రాజ్‌కుమార్ వడయార్‌చే రూపుదిద్దుకున్న పద్మవిభూషణ్, ప్రజాకవి కాళోజీ నారాయణరావు విగ్రహాన్ని ఆదివారం కొత్తపేట నుంచి వరంగల్‌కు తరలించారు. సోమవారం వరంగల్‌లో ప్రజాకవి కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ చేతులమీదుగా విగ్రహావిష్కరణ జరుగుతుందని వడయార్ తెలిపారు. గతంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో రాణి రుద్రమదేవి, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలను రూపకల్పన చేశామన్నారు. ఇప్పుడు కాళోజీ విగ్రహాన్ని తమ చేతులమీదుగా రూపుదిద్దుకోవడం ఆనందంగా ఉందంటూ తెలంగాణ సర్కారుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
- కొత్తపేట