కాళేశ్వరం సబ్ కాంట్రాక్టులో భారీగా అవకతవకలు!
ABN , First Publish Date - 2021-01-13T04:48:41+05:30 IST
కాళేశ్వరం సబ్ కాంట్రాక్టులో భారీగా అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టు పనుల్లో బోగస్ సబ్ కాంట్రాక్స్ డీల్స్ జరిగినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. పన్ను ఎగవేతకు షెల్ కంపెనీలను...

హైదరాబాద్: కాళేశ్వరం సబ్ కాంట్రాక్టులో భారీగా అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టు పనుల్లో బోగస్ సబ్ కాంట్రాక్స్ డీల్స్ జరిగినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. పన్ను ఎగవేతకు షెల్ కంపెనీలను సృష్టించినట్టు ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా ఈ నెల 7న పలు కంపెనీల్లో జరిగిన సోదాల్లో అవకతవకలు బయటపడ్డాయి. రూ. 160 కోట్ల డబ్బును సీజ్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. అవకతవకలకు సంభందించిన C5 కంపెనీకి చెందిన పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్‌లు, ఫేక్ బిల్స్, ఇండెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఐటీ అధికారులు మొత్తం 19 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరిపారు.