కాళేశ్వరంలో అవినీతి నిరూపణకు సిద్ధం: నాగం
ABN , First Publish Date - 2021-01-20T08:09:47+05:30 IST
కాళేశ్వరంలో అవినీతి నిరూపణకు సిద్ధం: నాగం

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన రూ.వేల కోట్ల అవినీతిని సాక్ష్యాధారాలతో నిరూపించడానికి తాను సిద్ధమని మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి ప్రకటించారు. కాళేశ్వరం పనుల్లో అవినీతి జరగలేదంటూ ప్రకటించిన ఈఎన్‌సీలు, విశ్రాంత ఇంజనీర్లు తమ సవాలు స్వీకరించడానికి సిద్ధమా అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో వాస్తవధరలకు, అగ్రిమెంట్ల ధరలకు మధ్య వ్యత్యాసం ఉందని, ఇది పచ్చి దోపిడీ కాదా అని ప్రశ్నించారు.