కేయూ లా విద్యార్థుల ఆందోళన

ABN , First Publish Date - 2021-12-07T05:37:42+05:30 IST

కేయూ లా విద్యార్థుల ఆందోళన

కేయూ లా విద్యార్థుల ఆందోళన

 కేయూ క్యాంపస్‌, డిసెంబరు 6 : కేయూ లా విద్యార్థులు సోమవారం న్యాయశాస్త్రం 4, 8వ సెమిస్టర్‌ ఫలితాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ క్యాంప్‌సలోని పరిపాలన భవనం ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు. ఈ నెల 5న విడుదల చేసిన ఎల్‌ఎల్‌బీ 4, 8వ సెమిస్టర్‌ ఫలితాలపై న్యాయ విచారణ జరుపాలని అన్నారు. అనేక మంది విద్యార్థులు ఫెయిల్‌ అయ్యారని, మరికొందరి ఫలితాల్లో తప్పులు దొర్లాయని ఆరోపించారు. సెమిస్టర్‌ ఫలితాలపై వర్సిటీ ఉన్నతాధికారులు స్పందించాలని, ఉచితంగా రీ వాల్యూవేషన్‌కు అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో కేయూ పోలీసులు పరిపాలన భవనం ఎదుట భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. విద్యార్థులకు వర్సిటీ అధికారులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఆందోళనను కొనసాగిస్తున్నారు. అర్థరాత్రి వర్సిటీ పరిపాలన భవనం వద్దనే భోజనం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడే ఉంటామని భీష్మించుకుని కూర్చున్నారు. రాత్రి ఇక్కడే పడుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇదిలా ఉండగా వర్సిటీ పరీక్షల నియంత్రణాధికారులు ఫలితాల్లో తప్పులేమీ లేవని.. ఏదైనా ఉంటే రాతపూర్వకంగా ఇస్తే పరిశీలిస్తామని చెప్పారు.

 

Updated Date - 2021-12-07T05:37:42+05:30 IST