మోదీది రైతు, దళిత వ్యతిరేక ప్రభుత్వం: కడియం శ్రీహరి

ABN , First Publish Date - 2021-11-21T18:54:24+05:30 IST

నరేంద్రమోదీది రైతు, దళిత వ్యతిరేక ప్రభుత్వమని కడియం శ్రీహరి విమర్శించారు.

మోదీది రైతు, దళిత వ్యతిరేక ప్రభుత్వం: కడియం శ్రీహరి

హన్మకొండ: నరేంద్రమోదీది రైతు, దళిత వ్యతిరేక ప్రభుత్వమని టీఆర్ఎస్ నేత, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి విమర్శించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఏడేళ్లలో దేశ జీడీపీ తగ్గితే.. తెలంగాణ జీఎస్టీ పెరిగిందన్నారు. దేశానికి ఎక్కువ ఆదాయం ఇస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందుందన్నారు. ఉద్యోగాల కల్పన లేకపోగా..ప్రభుత్వ సంస్థలను అమ్ముతున్నారని విమర్శించారు. ఆహారపు కొరత ఉందని నిపుణులు హెచ్చరిస్తుంటే.. కేంద్రం ధాన్యాన్ని ఎందుకు కొనడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదని కడియం శ్రీహరి అన్నారు.

Updated Date - 2021-11-21T18:54:24+05:30 IST