మహిళలకు దక్కని న్యాయం: మాడభూషి శ్రీధర్‌

ABN , First Publish Date - 2021-12-19T07:30:00+05:30 IST

వివాహానంతర అత్యాచారాల విషయంలో మహిళలకు భారత న్యాయస్థానాలు తగిన న్యాయం చేయడం లేదని మహేంద్ర విశ్వవిద్యాలయం న్యాయ విభాగం డీన్‌ మాడభూషి శ్రీధర్‌ ఆరోపించారు.

మహిళలకు దక్కని న్యాయం: మాడభూషి శ్రీధర్‌

న్యూఢిల్లీ, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): వివాహానంతర అత్యాచారాల విషయంలో మహిళలకు భారత న్యాయస్థానాలు తగిన న్యాయం చేయడం లేదని మహేంద్ర విశ్వవిద్యాలయం న్యాయ విభాగం డీన్‌ మాడభూషి శ్రీధర్‌ ఆరోపించారు. ప్రముఖ రచయిత్రి కల్పనా రెంటాల కథా సంకలనం అయిదో గోడపై ఢిల్లీలోని ఆంధ్రా అసోసియేషన్‌ ఏర్పాటు చేసిన చర్చా గోష్ఠిలో ఆయన మాట్లాడుతూ.. భారత దేశంలో ఉన్న వ్యవస్థలు పురుషులకు అనుకూలంగా ఉన్నాయన్నారు. వాటిలో న్యాయవ్యవస్థ భిన్నమైనది కాదని విమర్శించారు. కల్పన రాసిన కథలు ఆధునిక సమాజంలో సంక్లిష్టతలకు, కుటుంబ జీవితాల్లో సంక్షోభాలకు నిదర్శనమని ‘ఆంధ్రజ్యోతి’ ఢిల్లీ బ్యూరో చీఫ్‌ ఏ.కృష్ణారావు పేర్కొన్నారు. 

Updated Date - 2021-12-19T07:30:00+05:30 IST