న్యాయవ్యవస్థకు స్వయంప్రతిపత్తి అవసరం: రాంమాధవ్‌

ABN , First Publish Date - 2021-05-30T09:26:37+05:30 IST

దేశంలో న్యాయవ్యవస్థకు స్వయంప్రతిపత్తి(అటానమస్‌) ఇవ్వవలసిన అవసరం ఉందని బీజేపీ నేత రాంమాధవ్‌ అభిప్రాయపడ్డారు.

న్యాయవ్యవస్థకు స్వయంప్రతిపత్తి అవసరం: రాంమాధవ్‌

హైదరాబాద్‌, మే 29 (ఆంధ్రజ్యోతి): దేశంలో న్యాయవ్యవస్థకు స్వయంప్రతిపత్తి(అటానమస్‌) ఇవ్వవలసిన అవసరం ఉందని బీజేపీ నేత రాంమాధవ్‌ అభిప్రాయపడ్డారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థ తీర్పులు, వ్యాఖ్యలపై విమర్శలు చేయకూడదన్నారు. జాతీయ జ్యుడీషియల్‌ కమిషన్‌ ఏర్పాటును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. కార్యనిర్వాహక, శాసన వ్యవస్థలను న్యాయవ్యవస్థ తన చేతుల్లోకి తీసుకోవడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థ- రాజకీయ కోణం అన్న అంశంపై మెస్సర్‌ శ్యాంపద్మన్‌ అసోసియేట్స్‌ శనివారం నిర్వహించిన వెబినార్‌ చర్చాగోష్ఠిలో ఆయన మాట్లాడారు. న్యాయమూర్తుల పదవీ విరమణ వ యస్సు 70 ఏళ్లు ఉండాలని,  పదవీ విరమణ తర్వాత వారు ఎలాంటి లాభదాయక పదవులు నిర్వహించకూడదని, అప్పుడే స్వయంప్రతిపత్తికి న్యాయం చేసినట్లవుతుందన్నారు. రిటైర్డు జస్టిస్‌ రామకృష్ణణ్‌ కృష్ణయ్యర్‌తో పాటు న్యాయనిపుణులు ప్రొఫెసర్‌ డాక్టర్‌ మోహన్‌ బల్లా, ఎన్‌.విజయ్‌, డాక్టర్‌ శ్రీకాంత్‌, కె.వి.ఎ.రావు, రాంకుమార్‌, శ్యాం పద్మన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-30T09:26:37+05:30 IST