YS Jagan బెయిల్ రద్దు పిటిషన్పై నేడే తీర్పు.. ఏం జరుగుతుందో..!?
ABN , First Publish Date - 2021-08-25T09:00:37+05:30 IST
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బెయిల్ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్పై సీబీఐ కోర్టు బుధవారం తీర్పు వెలువరించనుంది.

హైదరాబాద్, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బెయిల్ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్పై సీబీఐ కోర్టు బుధవారం తీర్పు వెలువరించనుంది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలుచేసిన ఈ పిటిషన్పై జూలై ఆఖరులో వాదనలు ముగిశాయి. తీర్పును అప్పటినుంచి కోర్టు రిజర్వు చేసింది. ముఖ్యమంత్రిగా తనకుండే అధికారాలను ఉపయోగించి.. జగన్ బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారని రఘురామ ఏప్రిల్ మొదటి వారంలో దాఖలు చేసిన పిటిషన్లో ఆరోపించారు. బెయిల్ రద్దుచేసి ఆయనపై ఉన్న కేసులను శరవేగంగా విచారించాలని కోరారు. సీఎం హోదాలో జగన్ వివిధ కారణాలు చెబుతూ, కోర్టుకు హాజరు కాకుండా డుమ్మా కొడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మరోవైపు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ కూడా రద్దు చేయాలని రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై బుధవారం సీబీఐ కోర్టులో విచారణ కొనసాగనుంది.