చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
ABN , First Publish Date - 2021-08-26T05:11:51+05:30 IST
చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

భీమదేవరపల్లి, ఆగస్టు 25: చట్టాలపై ప్రతీ ఒక్కరికీ అవగాహన కలిగి ఉండాలని హుస్నాబాద్ సివిల్ జడ్జి గూడ అనూష అన్నారు. బుధవారం వంగరలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి అనూష మాట్లాడుతూ.. సివిల్, క్రిమినల్ కేసుల గురించి చట్టాలపై అవగాహన కల్పించారు. లోక్ అదాలత్‌లో పెండింగ్‌లో ఉన్న కోర్డు సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. హుస్నాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దుబ్బాక నాగరాజు, సర్పంచ్ అలూరి రజిత, ఎంపీటీసీ నల్ల కౌసల్య, ఎస్‌ఐ నవీన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.