జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా గుర్తించాలి

ABN , First Publish Date - 2021-05-05T08:16:32+05:30 IST

: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జర్నలిస్టులను ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌గా గుర్తించాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు తెలంగాణ ప్రాంత జర్నలిస్టులు బహిరంగ లేఖ రాశారు.

జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా గుర్తించాలి

ముఖ్యమంత్రికి జర్నలిస్టుల బహిరంగ లేఖ

పంజాగుట్ట/హైదరాబాద్‌, మే 4 (ఆంధ్రజ్యోతి): కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జర్నలిస్టులను ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌గా గుర్తించాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు తెలంగాణ ప్రాంత జర్నలిస్టులు బహిరంగ లేఖ రాశారు. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో సీనియర్‌ పాత్రికేయులు పల్లె రవికుమార్‌, సతీ్‌షకుమార్‌, విజయసారధి తదితరులు ఆలేఖను విడుదల చేశారు. వృత్తిపరంగా పలు ప్రాంతాల్లో తిరిగేవారు కరోనా బారిన పడితే వైద్యచికిత్సలు సైతం సక్రమంగా అందటంలేదని వారు పేర్కొన్నారు. ఎన్‌.విశ్వనాథ్‌, ఎం.ఎన్‌.స్వామి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాగా, రాష్ట్రంలోని జర్నలిస్టులను ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌గా గుర్తించి ఆర్థిక చేయూతను అందించాలని ఐజేయూ అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌ రెడ్డి, కార్యదర్శి వై.నరేందర్‌ రెడ్డి, టీయూడబ్ల్యూజే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్‌, కె.విరాహత్‌ అలీ, ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్‌ శ్రీకాంత్‌లు ఒక సంయుక్త  ప్రకటనలో కోరారు. 

Updated Date - 2021-05-05T08:16:32+05:30 IST