జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకా తయారీకి బయోలాజికల్‌-ఈ ఒప్పందం

ABN , First Publish Date - 2021-05-20T07:53:13+05:30 IST

జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కొవిడ్‌ వ్యాక్సిన్‌ను హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్‌-ఈ సంస్థ తయారు చేయనుంది.

జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకా తయారీకి బయోలాజికల్‌-ఈ ఒప్పందం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కొవిడ్‌ వ్యాక్సిన్‌ను హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్‌-ఈ సంస్థ తయారు చేయనుంది. ఈ మేరకు ఇరు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకాను భారత్‌లో ఉత్పత్తి చేస్తే.. కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌, స్పుత్నిక్‌-వి తర్వాత ఇక్కడ తయారీ కానున్న నాలుగో వ్యాక్సిన్‌గా నిలుస్తుంది. ఇది సింగిల్‌ డోస్‌ టీకా. దీని ధర భారత్‌లో దాదాపు రూ.750 ఉండే అవకాశం ఉంది.  బయోలాజికల్‌-ఈ సొంతంగా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌తో పాటు జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సింగిల్‌ డోస్‌ వ్యాక్సిన్‌ను కూడా తయారు చేయనుంది. కాంట్రాక్టు పద్ధతిలో ఏడాదికి 60 కోట్ల డోసుల జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయాలని భావిస్తున్నారు.

Updated Date - 2021-05-20T07:53:13+05:30 IST