రాష్ట్రంలో జిహాదీ మూకలు పెరిగిపోతున్నాయి

ABN , First Publish Date - 2021-03-14T07:53:08+05:30 IST

కేసీఆర్‌ అధికారాన్ని చేపట్టినప్పటి నుంచి ప్రతి జిల్లాలో జిహాదీ మూకలు ప్రత్యేక స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నాయని విశ్వ హిందూ పరిషత్‌ తెలంగాణ అధ్యక్షుడు రామరాజు ఆరోపించారు.

రాష్ట్రంలో జిహాదీ మూకలు పెరిగిపోతున్నాయి

16న డీజీపీ కార్యాలయం ముట్టడి: వీహెచ్‌పీ

మంగళ్‌హాట్‌, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్‌ అధికారాన్ని చేపట్టినప్పటి నుంచి ప్రతి జిల్లాలో జిహాదీ మూకలు ప్రత్యేక స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నాయని విశ్వ హిందూ పరిషత్‌ తెలంగాణ అధ్యక్షుడు రామరాజు ఆరోపించారు. శనివారం కోఠిలో రామరాజుతో పాటు వీహెచ్‌పీ నేతలు మాట్లాడారు. మజ్లి్‌సకు తొత్తుగా మారిన ప్రభుత్వం హిందువుల పట్ల వివక్ష చూపుతోందని విమర్శించారు. బైంసా ఘటనలకు వ్యతిరేకంగా సోమవారం అన్ని కలెక్టరేట్లలో వినతిపత్రం ఇస్తామని ప్రకటించారు. బజరంగ్‌దళ్‌ ఆధ్వర్యంలో 16న డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు.

Updated Date - 2021-03-14T07:53:08+05:30 IST