బంగారు తెలంగాణే కేసీఆర్‌ ధ్యేయం

ABN , First Publish Date - 2021-09-03T05:49:41+05:30 IST

బంగారు తెలంగాణే కేసీఆర్‌ ధ్యేయం

బంగారు తెలంగాణే కేసీఆర్‌ ధ్యేయం
ఖిలావరంగల్‌ అమరవీరుల స్థూపం వద్ద నినాదాలు చేస్తున్న ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌

వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నరేందర్‌


ఖిలావరంగల్‌, సెప్టెంబరు 2: బంగారు తెలంగాణే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధ్యేయమని, తెలంగాణ కీర్తి దేశమంతా వ్యాపింప చేసేందుకు కృషి చేస్తున్నా రని వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ అన్నారు. గురువారం ఖిలావరంగల్‌లో మాజీ కార్పొరేటర్‌ బైరబోయిన దామోదర్‌ యాదవ్‌ ఆధ్వ ర్యంలో టీఆర్‌ఎస్‌ జెండా పండుగ సందర్భంగా పార్టీ జెండాను ఎగురవేశా రు. అనంతరం తెలంగాణ తల్లీ, ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ల విగ్రహాలకు నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ జాతిని ఏకం చేసిన జెండా టీఆర్‌ఎస్‌ జెండా అన్నారు. నగరంలో కలెక్టరేట్‌ను నిర్మించి నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మే యర్‌ రిజ్వానా షమీమ్‌-మసూద్‌, కార్పొరేటర్లు వేల్పుగొండ సువర-సురేష్ణ్‌, బైరబోయిన ఉమా-దామోదర్‌యాదవ్‌, సోమిశెట్టి ప్రవీణ్‌, వస్కుల బాబు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-03T05:49:41+05:30 IST