బీజేపీ‌కి బంట్రౌతు‌గా రేవంత్: జీవన్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-12-25T17:25:34+05:30 IST

తెలంగాణ బియ్యానికి బీజేపీ దయ్యంలా మారిందని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు.

బీజేపీ‌కి బంట్రౌతు‌గా రేవంత్: జీవన్‌రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ బియ్యానికి బీజేపీ దయ్యంలా మారిందని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్, బీజేపీ నేతలు బూతులకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు వకాల్తా పుచ్చుకుని రేవంత్ బీజేపీ‌కి బంట్రౌతు‌గా మారిపోయారని మండిపడ్డారు. ఢిల్లీకి మంత్రులు ఎంపీలు వెళ్తే అవమాన పరుస్తారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నిర్వహించెది రచ్చబండ కాదు తమ పతనానికి నాంది అవుతుందనిన్నారు.  తీన్మార్ మల్లన్న తన తీరు మార్చుకోకపోతే టీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడికక్కడ తరముతాయని హెచ్చరించారు. మంత్రి కేటీఆర్ కుమారుడిపై వాడిన భాషను కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొడుకుపై వాడితే బీజేపీ నేతలు సమర్థిస్తారా అని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. 

Updated Date - 2021-12-25T17:25:34+05:30 IST