ప్రజాగాయకుడు జయరాజ్‌కు మాతృవియోగం

ABN , First Publish Date - 2021-01-14T04:08:51+05:30 IST

ప్రజాగాయకుడు జయరాజ్‌కు మాతృవియోగం

ప్రజాగాయకుడు జయరాజ్‌కు మాతృవియోగం
అచ్చమ్మ (ఫైల్‌)

మహబూబాబాద్‌, జనవరి 13 (ఆంధ్రజ్యోతి) : ప్రముఖ అభ్యుదయ కవి, ప్రజాగాయకుడు, వాగ్గేయకారుడు, ప్రకృతి ప్రేమికుడు గొడిసాల జయరాజు తల్లి అచ్చమ్మ (100) బుధవారం ఉదయం 8.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. మహబూబాబాద్‌ పట్టణంలోని గుమ్ముడూరులోని తన నివాసంలో మృతి చెందారు. ఆమె మృతదేహాన్ని పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు సందర్శించి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. సాయంత్రం గుండ్లకుంట కాలనీలోని శ్మశాన వాటికలో బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. మృతురాలికి ఏకైక కుమారుడు జయరాజ్‌ ఉన్నారు.


Updated Date - 2021-01-14T04:08:51+05:30 IST