తెలంగాణ స్వాప్నికుడు జయశంకర్‌

ABN , First Publish Date - 2021-06-22T08:14:08+05:30 IST

తెలంగాణ స్వయం పాలనా స్వాప్నికుడు, స్వరాష్ట్ర ఉద్యమంలో భావజాల వ్యాప్తికి జీవితాంతం కృషి చేసిన ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ చరిత్రలో చిరకాలం నిలిచిపోతారని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

తెలంగాణ స్వాప్నికుడు జయశంకర్‌

 రాష్ట్ర అభివృద్ధే సారుకు ఘన నివాళి: కేసీఆర్‌

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): తెలంగాణ స్వయం పాలనా స్వాప్నికుడు, స్వరాష్ట్ర ఉద్యమంలో భావజాల వ్యాప్తికి జీవితాంతం కృషి చేసిన ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ చరిత్రలో చిరకాలం నిలిచిపోతారని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఆయన ఆశయాలను తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణలో పెడుతున్నదని చెప్పారు. జయశంకర్‌ వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరించుకున్నారు. స్వరాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధిస్తూ జయశంకర్‌కు ఘన నివాళి అర్పిస్తున్నదని సీఎం కేసీఆర్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి జయశంకర్‌ ఊపిరిగా పని చేశారని స్పీకర్‌ పోచారం శ్రీనివా్‌సరెడ్డి కొనియాడారు. సోమవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని జయశంకర్‌ కాంస్య విగ్రహానికి ఆయన నివాళులర్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్‌.. సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జయశంకర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. రవీంద్రభారతి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌, తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ సెక్రెటరీ జనరల్‌, పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు, హోం మంత్రి మహమూద్‌ అలీ తదితరులు జయశంకర్‌కు నివాళులర్పించారు. 

Updated Date - 2021-06-22T08:14:08+05:30 IST