బీజేపీ కార్యాలయంలో వాల్మీకి జయంతి వేడుక
ABN , First Publish Date - 2021-10-21T10:08:04+05:30 IST
వాల్మీకి జయంతి వేడుకలు బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి..
వాల్మీకి జయంతి వేడుకలు బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పార్టీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్.. వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయన మాట్లాడుతూ శ్రీరాముడిని ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప వ్యక్తి వాల్మీకి అనిఅన్నారు. ఆయన రాసిన రామాయణం మనందరికీ జీవిత పాఠాలు నేర్పుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు ప్రకా్‌షరెడ్డి, శాంతికుమార్, క్రాంతి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.