‘5 నుంచి యువజనోత్సవాలు’

ABN , First Publish Date - 2021-12-31T05:41:41+05:30 IST

‘5 నుంచి యువజనోత్సవాలు’

‘5 నుంచి యువజనోత్సవాలు’

జనగామ కల్చరల్‌, డిసెంబరు 30 : యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో యువజనోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ శివలింగయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాస్థాయి సాంస్కృతిక, క్రీడాంశాల నిర్వహణలో భా గంగా జనవరి 5 నుంచి యువజనోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. జానపద నృత్యం (గ్రూపు), జానపద గీతం (గ్రూపు), వకృత్వ పోటీలు (హిం దీ/ఇంగ్లీషు), వ్యాసరచన పోటీలు (హిందీ/ఇంగ్లీషు) నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పోటీలోని ప్రతీ అంశంలో విజేతలను నిర్ణయించి ఒకటవ స్థానం పొం దిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపించనున్నట్లు తెలిపారు. జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొను యువతీ యువకులు 15 నుంచి 29ఏళ్ల లోపు వయస్సు గల వారై ఉండాలన్నారు. ఆసక్తి గలవారు ఈనెల 5న ఉదయం స్థానిక వైష్ణవి గార్డెన్స్‌లోఫొటో, విద్యార్హతధ్రువీకరణపత్రాలు, ఆధార్‌కార్డు జిరాక్స్‌ కాపీలతో హాజరు కావాలన్నారు. వివరాలకు 98499 09081 నంబరులో సంప్రదించాలన్నారు. 

Updated Date - 2021-12-31T05:41:41+05:30 IST