తెలంగాణ బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడ్డ పవన్ కల్యాణ్

ABN , First Publish Date - 2021-03-14T17:35:22+05:30 IST

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాము కేంద్ర నాయకత్వంతో

తెలంగాణ బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడ్డ పవన్ కల్యాణ్

హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాము కేంద్ర నాయకత్వంతో కలిసి పనిచేస్తున్నా, తెలంగాణ రాష్ట్ర శాఖ తమను అవమానించిందని మండిపడ్డారు. జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన పార్టీ సమావేశంలో మాట్లాడారు.  జనసేనను చులకన చేసేలా బీజేపీ మాట్లాడిందని ఆరోపించారు. బీజేపీ తమను పదే పదే అవమానిస్తోందని మండిపడ్డారు. అందుకే తాము తెలంగాణలో టీఆర్‌ఎస్ అభ్యర్థి వాణిదేవికి మద్దతిస్తున్నామని వెల్లడించారు. పీవీ ఆర్థిక సంస్కరణలు తెచ్చిన మహానుభావుడని పవన్ కొనియాడారు. Updated Date - 2021-03-14T17:35:22+05:30 IST