1.91 లక్షల ఖాళీ పోస్టులు ఉన్నట్లుగా..పీఆర్సీ నివేదిక ఎందుకిచ్చింది?
ABN , First Publish Date - 2021-02-26T07:56:02+05:30 IST
ఏడేళ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగాలను భర్తీ చేసి ఉంటే.. రాష్ట్రంలో 1.91 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పీఆర్సీ ఎందుకు నివేదిక ఇచ్చిందని మాజీ మంత్రి జానారెడ్డి ప్రశ్నించారు. ప్రస్తుతం తెలంగాణ

మంత్రి కేటీఆర్‌కు జానారెడ్డి ప్రశ్న
హైదరాబాద్, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): ఏడేళ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగాలను భర్తీ చేసి ఉంటే.. రాష్ట్రంలో 1.91 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పీఆర్సీ ఎందుకు నివేదిక ఇచ్చిందని మాజీ మంత్రి జానారెడ్డి ప్రశ్నించారు. ప్రస్తుతం తెలంగాణ ఉద్యోగులకు సంబంధించి క్యాడర్ స్ట్రెంత్ 4.90 లక్షలుగా ఉందని, ఈ మేరకు పెంచింది కాంగ్రెస్ ప్రభుత్వాలు కాదా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో 10 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదంటూ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. గాంధీభవన్‌లో గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. నిరుద్యోగ భృతిని ఇంతవరకు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే కాంగ్రె్‌సపైన నిందలు వేస్తున్నారని ఆయన అన్నారు.
సోషల్ మీడియా అభిమానులను నేతలే కట్టడి చేయాలి
సోషల్ మీడియా అభిమానులను కాంగ్రె్‌సలోని ఆయా నాయకులు కట్టడి చేసుకోవాలని మాజీ మంత్రి జానారెడ్డి సూచించారు. సోషల్ మీడియా వేదికగా పార్టీకి చెందిన తమ నాయకుడు గొప్పంటే.. తమ నాయకుడు గొప్పంటూ అభిమానులు సవాళ్లు విసురుకోవడం సరికాదన్నారు. అవగాహన లేకుండా సొంత నాయకత్వాన్నే దిగజారిస్తే అది మొత్తం పార్టీకి, నాయకత్వ శ్రేణి ఐక్యతకు నష్టం చేస్తుందన్నారు. ఇలా వ్యవహరిస్తున్న వారిపై పీసీసీ సీరియ్‌సగా ఉండాలని, అవసరమైతే వారిని పార్టీ నుంచి సస్పెండ్ లేదా డిస్మిస్ చేయాలని ఆయన సూచించారు.