వాళ్లు ఏం చేయలేరు: జానారెడ్డి

ABN , First Publish Date - 2021-03-22T19:55:26+05:30 IST

ఎక్కడి నుంచో వచ్చి దారి డొంక తెలియని వాళ్లు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పోటీ చేసి ఏమీ చేయలేరని కాంగ్రెస్ నేత కుందూరు జానారెడ్డి పేర్కొన్నారు.

వాళ్లు ఏం చేయలేరు: జానారెడ్డి

నల్లగొండ: ఎక్కడి నుంచో వచ్చి దారి డొంక తెలియని వాళ్లు నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పోటీ చేసి ఏమీ చేయలేరని కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి పేర్కొన్నారు. సోమవారం నాగార్జునసాగర్ ఉపఎన్నికపై హాలియా మున్సిపాలిటీలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జానారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విలువలు, నైతికత, ప్రజాస్వామ్యం బతకడం కోసం ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని చెప్పారు. తెలంగాణ తెచ్చింది ఒక్క కేసీఆర్ కాదు.. అప్పటి హై కమాండ్‌ను ఒప్పించడంలో నాకు భాగం ఉందన్నారు. ఈనెల 27న జనగర్జన బహిరంగ సభకు బైకు ర్యాలీగా కార్యకర్తలు, నాయకులు భారీగా తరలి రావాలని జానారెడ్డి  పిలుపునిచ్చారు.

Updated Date - 2021-03-22T19:55:26+05:30 IST