కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పాలనపై విస్తృత ప్రచారం సాగించాలి

ABN , First Publish Date - 2021-12-31T05:43:53+05:30 IST

కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పాలనపై విస్తృత ప్రచారం సాగించాలి

కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పాలనపై విస్తృత ప్రచారం సాగించాలి

 జనగామ టౌన్‌, డిసెంబరు 30 : ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు, పాలనపై ప్రజాచైతన్యంలో కార్యకర్తలు ముందంజలో ఉండి పని చేయాలని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.ధర్మారావు పిలుపునిచ్చారు. జనగామ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గురువారం జనగామ పట్టణ, మండల కార్యకర్తలకు నిర్వహించిన ఒకరోజు శిక్షణ శిబిరానికి జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంతరెడ్డి అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథిగా ధర్మారావు పాల్గొని, మాట్లాడారు. రాబోయే రోజులలో తెలంగాణలో బీజేపీకి అధికారం ఖాయమని, అధికారం లక్ష్యంగా కార్యకర్తలు సమరోత్సాహంతో పని చేయాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు విద్యాసాగర్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి పాపారావు, నాయకులు జి.ప్రేమలతారెడ్డి, సౌడ రమేష్‌, బొట్ల శ్రీనివాస్‌, బండారు తిరుపతి, దేవరాయ ఎల్లయ్య, ఉడుగుల రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-31T05:43:53+05:30 IST