నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలి
ABN , First Publish Date - 2021-10-22T05:08:28+05:30 IST
నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలి
జనగామ టౌన్, అక్టోబరు 21: నాటే మొక్కలను సంరక్షించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య గురువారం అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని వడ్లకొండరోడ్‌లో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను ఆకస్మిక తనిఖీతో పరిశీలించారు. మొక్కలకు ట్రీగార్డులు ఏర్పాటుచేసి పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని అధికారులు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో రాంరెడ్డి, డీఎంహెచ్‌వో మహేందర్, ఎంపీడీవో హిమబిందు, సర్పంచ్ బొల్లం శారద, తదితరులు పాల్గొన్నారు.
వ్యాక్సిన్ సెంటర్‌ను తనిఖీ చేసిన కలెక్టర్
జనగామ మండలం చీటకోడూర్ గ్రామంలోని వ్యాక్సిన్ సెంటర్‌ను గురువారం కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించి స్థానిక సిబ్బందికి సలహాలు, సూచనలు అందించారు. జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో ఎ మహేందర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.