జంపన్నవాగులో ఇద్దరి గల్లంతు

ABN , First Publish Date - 2021-07-13T05:21:34+05:30 IST

జంపన్నవాగులో ఇద్దరి గల్లంతు

జంపన్నవాగులో ఇద్దరి గల్లంతు

మేడారం, జూలై 12: ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం జంపన్న వాగు వరద నీటిలో ఇద్దరు గల్లంతైన సంఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. పస్రా సీఐ అనుముల శ్రీనివాస్‌ తెలిపిన వివరాల మేరకు... మణుగూరు మండలం కొండాపూర్‌కు చెందిన బంగారి శ్యామల్‌రావు(24), ఉడిమడి కోటేశ్వరరావు(31) బంధుమిత్రులతో కలిసి వనదేవతల దర్శనానికి మేడారం వచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తుండగా గల్లంతయ్యారు. గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ వారి ఆచూకీ లభ్యం కాలేదు. కోటేశ్వరావుకు భార్య మీనా, ఇద్దరు పిల్లలు ఉండగా శ్యామల్‌రావు అవివాహితుడని సీఐ తెలిపారు.  


Updated Date - 2021-07-13T05:21:34+05:30 IST