78 మంది మందు బాబులకు జైలు
ABN , First Publish Date - 2021-02-26T08:12:10+05:30 IST
డ్రంకెన్ డ్రైవ్‌పై ఉక్కుపాదం మోపుతున్న సైబరాబాద్ పోలీసులు.. మందుబాబు ల మత్తు వదిలిస్తున్నారు. కేసులు నమోదు చేసి, చార్జిషీట్ దా ఖలు చేసి న్యాయస్థానంలో హాజరు పరుస్తున్నారు

హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): డ్రంకెన్ డ్రైవ్‌పై ఉక్కుపాదం మోపుతున్న సైబరాబాద్ పోలీసులు.. మందుబాబు ల మత్తు వదిలిస్తున్నారు. కేసులు నమోదు చేసి, చార్జిషీట్ దా ఖలు చేసి న్యాయస్థానంలో హాజరు పరుస్తున్నారు. ఈ క్రమంలో గురువారం సైబరాబాద్ ట్రాపిక్ పోలీసులు143 మంది మందు బాబులను కోర్టులో హాజరపరిచారు. డ్రంకెన్‌ల తీరు, వారు తాగిన ఆల్కాహాల్ శాతం వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానాలు 78 మంది మందుబాబులకు 1-14 రోజుల పాటు జైలు శిక్ష విఽధించారు. ఇదిలా ఉండగా.. డ్రైౖవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన వారికి 1-3 రోజులు జైలు శిక్ష, జరిమానాలు విధించారు. ఒక మైనర్ డ్రైవింగ్ కేసులో రూ. 5వేలు జరిమానా విధించింది.