Jagityala: కోరుట్లలో భారీ అగ్నిప్రమాదం
ABN , First Publish Date - 2021-08-18T13:38:43+05:30 IST
కోరుట్లలోని ఆనంద్ షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షాపింగ్ మాల్లో ఒక్కసారిగా మంటలు పెద్దఎత్తున్న చెలరేగాయి. మంటల్లో షాపింగ్ మాల్ పూర్తిగా దగ్ధం అయింది

జగిత్యాల: కోరుట్లలోని ఆనంద్ షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షాపింగ్ మాల్లో ఒక్కసారిగా మంటలు పెద్దఎత్తున్న చెలరేగాయి. మంటల్లో షాపింగ్ మాల్ పూర్తిగా దగ్ధం అయింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. మంటల్లో షాపింగ్ మాల్ పూర్తిగా దగ్ధం అయింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే..ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.