ప్రారంభమైన మల్లికార్జునస్వామి జాతర

ABN , First Publish Date - 2021-01-14T04:11:46+05:30 IST

ప్రారంభమైన మల్లికార్జునస్వామి జాతర

ప్రారంభమైన మల్లికార్జునస్వామి జాతర
గ్రామదేవతకు పూజలు నిర్వహిస్తున్న యాదవులు

గూడూరు రూరల్‌, జనవరి 13 : మండలంలోని మచ్చర్ల అటవీప్రాంతంలో మల్లికార్జునస్వామి జాతర బుధవారం ఘనంగా ప్రారంభమైంది. గ్రామంలోని పెద్దగొల్ల కాడబోయిన నర్సయ్య, సారగొల్ల ఆవుల రాములు ఇళ్లలో, బొడ్రాయి వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం ఊరేగింపుగా అటవీప్రాంతంలోని మల్లికార్జునస్వామి గుడికి శోభాయాత్రగా బయలుదేరారు. జాతర వద్ద విద్యుత్‌, తాగునీటి సౌకర్యాన్ని జాతర నిర్వాహకులు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మల్లేష్‌, విమలాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-01-14T04:11:46+05:30 IST