బీజేపీలో చేరిన ఈటల రాజేందర్
ABN , First Publish Date - 2021-06-14T17:39:14+05:30 IST
మాజీ మంత్రి, కీలకనేత ఈటల రాజేందర్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, తరుణ్ చుగ్ సమక్షంలో ఈటల కాషాయ కండువా ...
ఢిల్లీ : మాజీ మంత్రి, కీలకనేత ఈటల రాజేందర్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, తరుణ్ చుగ్ సమక్షంలో ఈటల కాషాయ కండువా కప్పుకున్నారు. ఈటలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, కరీంనగర్ జడ్పీ మాజీ చైర్‌పర్సన్ తుల ఉమ, గండ్ర నళిని, ఆర్టీసీ కార్మిక సంఘం నేత అశ్వత్థామరెడ్డి, మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, అందె బాబయ్య తదితరులు బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు.
ఆ తర్వాత ఈటల నేతలతో కలిసి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇంటికి వెళ్లారు. అక్కడ నడ్డాతో సమావేశమయ్యారు.